ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం
నమః శివాయ
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయా
లయనిలయా
పంచభూతములు ముఖపంచకమై
ఆరుఋతువులూ
ఆహార్యములై
ప్రకృతి పార్వతి
నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
నీ దృక్కులే అటు
అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపసమందార నీ
మౌనమే
దశోపనిషత్తులై ఇల
వెలయ
త్రికాలములు నీ
నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ
ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస నీ
గానమే జంత్రగాత్రములు శ్రుతికలయ