వేటూరి గీత పంచకం #2
[ జనవరి 29 వేటూరి పుట్టినరోజు ని పురస్కరించుకొని అందిస్తున్నచిరుప్రయత్నం ]
పౌరాణికం - కిరాతార్జునీయం
తకిట తక తకిట జటిత పదయుగళా - హరహర మహాదేవ అభయంకరా
అని దేవతలు శివుని కొనియాడగా - పరవశమ్మున శివుడు తాండవమాడగా
కంపించెనంతలో కైలాసమా వేళ
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల
జగములేలే వాని సగము నివ్వెరపోయె
సగము మిగిలిన వాని మొగము నగవై పోయె
ఓం నమశ్శివాయ
అతడే అతడే అర్జునుడు - పాండవ వీర యశోధనుడు
అనితరసాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి
శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె
తలపైని గంగమ్మ తలపులోనికి పారె
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మారగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకారధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
శివుని ఆనతిని శిరమున దాల్చి - మూకాసురుడను రాక్షసుడు
వరాహరూపమ్ము ధరించి వచ్చెను - ధరాతలమ్మే అదిరిపోవగా
చిచ్చరపిడుగై వచ్చిన పందిని - రెచ్చిన కోపముతో
అర్జునుడు మట్టుపెట్టగా పట్టె బాణము - తనూ ఒక చేతను అందుకొని
చూసిన కంటిని చూడకనే గురి చూసినంతనే, వేసినంతనే
తలలు రెండుగా బిలబిల లాడుచు , తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటు ఇటు తగిలిన రెండు బాణముల అశువులు వీడెను వరాహము
కొట్టితి నేనని అర్జునుడు పడగొట్టితి నేనని శివుడు
పట్టిన పట్టును వీడకనే తొడగొట్టిన వీరముతో అపుడు
వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
మేటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడు
చేవ నాది చేత నాది చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసె అర్జునుడు
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు,
కానీ, అపుడతడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడు
ఓంకార ఘనధనుష్టంకారములతోడ శరపరంపర కురిసె హరుడు
అయినా, నరునికాతడు మనోహరుడు
చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధివిలాసమేమొ పెట్టిన గురి వట్టిదాయె
అస్త్రములే విఫలమాయె శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడిఎడమై సంధించుట మరచిపోయే
జగతికి సుగతిని సాధించిన తల - దిగంతాలకవతల వెలిగే తల
గంగకు నెలవై కలకాదరువై హరిబ్రహ్మలకు తరగని పరువై
అతిపవిత్రమై అఘలవిత్రమై, శ్రీకరమై శుభమైన
శివుని తల అదరగా, సృష్టి చెదరగా
తాడి ఎత్తు గాండీవముతో ఉత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున కొట్టినంతనే
తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు
కిరాతార్జునీయం
ఈ పాటను వ్యాఖ్యానించాలి అనుకున్నంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నేను చేయగలిగింది పరిచయం మాత్రమే. పాటంతా అలతి అలతి పదాలతో, భారవి (సంస్కృత కిరాతార్జునీయం) , శ్రీనాథుడు (హరవిలాసం), ధూర్జటి (శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం) మొదలైన మహాకవులు వర్ణించిన ఘట్టాన్ని అతి రమణీయంగా , అబ్బురపరిచే శబార్ధపాండిత్యం తో అద్భుతమైన పాట రాసాడు వేటూరి.
అర్ధం సులభగ్రాహ్యమే. ఇందులో కొన్ని మంచి చమత్కారాలు : (నిజానికి పాటంతా శబ్దాలంకారాలే )
"జగములేలే వాని సగము నివ్వెరపోయె సగము మిగిలిన వాని మొగము నగవై పోయె" శివుడు పార్వతీ అర్ధనారీశ్వరులని ప్రతీతి. శివుడు లోకేశ్వరుడు. అర్జునుని తపోవహ్నికి ప్రపంచం అల్లల్లాడగా, ఆ శివుడి సగం (పార్వతి) చకితురాలైందిట, మరి శివుడో ? ఆటను సగమే మిగిలాడు కదా, అతని మొగము (ముఖము) నగవైపోయే (నవ్వుమయమయిపోయిందిట )
జగము / సగము / మొగము / నగవు అంటూ అచ్చ తెలుగు పదాల ప్రాసతో ఎంతో చక్కని ఉత్ప్రేక్షని వర్ణించాడు కవి.
"నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె"; "నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె" ఈ ప్రయోగాలు scenicగా బాపు మార్కు picturization కి తగినట్టుగా అమిరాయి.
అన్నిటి కంటే గొప్ప ప్రయోగం "ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మారగా" ఎఱుక- జ్ఞానము కల్గిన శివుడు "ఎఱుకగా" కిరాతరూపం ధరించగా ... ఒకే శబ్దానికుండే రెండు అర్ధాలతో, అలంకారాలు ఆపోసన పట్టిన వేటూరి మహత్తరంగా రాసిన మాట ఇది. అన్నీ తెలిసిన శివుడు, మోక్ష స్వరూపమైన శివుడు తెలిసి తెలిసీ , ఒక బోయవాడి రూపం ధరించాడు. ఎందుకు ? భక్తుడి కోసం.
చిచ్చర పిడుగు - రెచ్చిన కోపం;
వేట నాది - వేటు నాది;
చేత నాది చేయి నాది చేటెరుగని ఈటె నాది; (పరాజయం తెలియని ధనుస్సు నాది)
అర్జునుడు - కార్తవీర్యార్జునుడు ;
హరుడు - మనోహరుడు;
ఓంకార-ధనుస్టంకార ;
అతిపవిత్రమై అఘలవిత్రమై;
తల అదరగా - సృష్టి చెదరగా ;
ఎదుట - ఎదలో;
ఈ ప్రయోగాలు వేటూరి ప్రాస ప్రియత్వాన్ని పట్టి ఇస్తాయి.
మరో అందమైన మాట "తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు". ఇది బహుశా ఈ పాటలో పరమాద్భుత ప్రయోగం.
తల్లిదండ్రుల ప్రేమ స్వచ్చమైనది . అలాంటి ప్రేమయే తనువైన (శరీరమైన) దేవుడుట శివుడు . ఆహా ఏమి వర్ణన ? దేవుని కరుణకి ఇంత అందమైన నిర్వచనం ఎవరైనా చెప్పారా ?
తమిళ శైవసిద్ధాంతంలో "అన్బేశివం" అనే మాట ఉందిట. అంటే "ప్రేమయే శివుడు" అని. ఆ భావస్ఫూర్తి మనకిక్కడ కనిపిస్తుంది.
"ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు" - ఇది వేటూరి మార్కు ప్రయోగం. ఇలాంటి ప్రయోగమే పంతులమ్మ సినిమాలో ఉంటుంది "ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు , ఎరుగని వారికి ఎదటే ఉన్నాడు " అని.
ఎదలోని శివుడు ఎదటే కనబడితే ? - పదములంటెను నరుడు . అంతేనండీ, అంతకంటే ఏంచెయ్యగలడు. మనము కూడా ఇంత గొప్ప వేటూరిని తెలుగు వారికి అందించినందుకు ఆ శివుడి పాదాలకు నమస్కరిద్దాము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి